

ఇటీవలి కాలంలో మహిళల్లో సాధారణంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) ఒకటిగా మారింది. దీనితో పాటు డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 6 నుంచి 13 శాతం వరకు మహిళలు పీసీఓఎస్‌తో బాధపడుతున్నారు, ఇంకా చాలామందికి ఈ సమస్య నిర్ధారణ కాకుండానే ఉంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల క్రమరహిత రుతుస్రావం, బరువు పెరగడం, మొటిమలు, జుట్టు రాలిపోవడం, వ్యంధ్యత్వం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పీసీఓఎస్ కేవలం అధిక బరువుతో ఉన్న వారికే కాదు, సన్నగా ఉన్న మహిళలకు కూడా రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అయితే సరైన జీవనశైలితో పీసీఓఎస్, డయాబెటిస్ రెండింటినీ నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బరువును అదుపులో ఉంచుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడం చాలా కీలకం. వైద్యుల సలహాతో మెట్ఫార్మిన్ వంటి మందులను ఉపయోగిస్తే లక్షణాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే, సరైన నిద్రతో పాటు యోగా, ధ్యానం వంటి పద్ధతులు కూడా హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తాయి.
గమనిక : ఇది సాధారణ అవగాహన కోసం మాత్రమే అందించిన సమాచారం. ఇది ఏ విధంగానూ వైద్య సూచనగా లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా పరిగణించరాదు. మీ ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే లేదా లక్షణాలు కనిపిస్తే, తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!