

చాలామందికి పొట్ట చదునుగా ఉన్నా, తిన్న వెంటనే కడుపు కుండలా ఉబ్బిపోతుంది. కొందరికి తిన్న తర్వాత కడుపు నొప్పి కూడా వస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక వారు ఇబ్బంది పడతారు. వేడినీరు, అల్లం టీ వంటి వాటిని ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఉండదు. అయితే, కొన్ని పండ్లు ఈ సమస్యను సహజంగా తగ్గిస్తాయి.
బొప్పాయి తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుందని తెలుసు, కానీ ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
ఇందులో ఉన్న పపైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, పేగుల్లో మంటను తగ్గిస్తుంది.
పైనాపిల్ సహజంగా జీర్ణక్రియను ప్రేరేపించే ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. భోజనం చేసిన 15 నిమిషాల తర్వాత తింటే గ్యాస్ ఉత్పత్తి తగ్గుతుంది, ఉబ్బరం రాకుండా చేస్తుంది. ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తర్వాత తినడం మంచిది.
అరటిపండు మలబద్ధకాన్ని నివారిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉన్న పొటాషియం శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇది నీరు నిల్వ ఉండటాన్ని తగ్గించి, కడుపు ఉబ్బరాన్ని నియంత్రిస్తుంది.
కివి పండులో ఎసిటైల్కోలిన్ ఎంజైమ్ ఉంటుంది, ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ప్రోటీన్ ఆహారాలు తిన్న తర్వాత కివి తింటే, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది, గ్యాస్ ఉత్పత్తి తగ్గుతుంది.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ వంటి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, జీర్ణక్రియను మెరుగుపరచి, పేగుల మంటను తగ్గిస్తాయి. కడుపు ఉబ్బరాన్ని సహజంగా నియంత్రిస్తాయి.











కామెంట్స్ (1)
చాలా ఉపయోగకరమైన మరియు ఆరోగ్యకరమైన చిట్కాలు!