

ఇడ్లీ, దోసలు దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన అల్పాహారాలు. కానీ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇడ్లీ పిండి త్వరగా పులిసిపోతుంది. దీంతో పిండి రుచి మారి పుల్లగా మారడం, ఇడ్లీలు గట్టిగా రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే ఈ పిండిని పారవేయాల్సిన అవసరం లేదు, కొన్ని సులభమైన చిట్కాలతో సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
పిండిని రుబ్బేటప్పుడు ఐస్ వాటర్ లేదా చల్లటి నీటిని ఉపయోగించడం వల్ల వేడి తగ్గి పులియడం నెమ్మదిస్తుంది. ఉప్పు ముందే కాకుండా అవసరమైనప్పుడు మాత్రమే కలపడం మంచిది. పిండి గాలి చొరబడని డబ్బాలో ఫ్రిజ్లో ఉంచాలి. ఒకవేళ పిండి ఎక్కువగా పుల్లగా మారితే, కొద్దిగా ఉడికించి చల్లార్చిన పాలు లేదా పెరుగు కలిపితే రుచి సరిచేయవచ్చు. అలాగే చిటికెడు వంట సోడా కలపడం వల్ల ఇడ్లీలు మళ్లీ మెత్తగా వస్తాయి.
గమనిక: ఈ సమాచారం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మాత్రమే. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!