

మనిషి మేధస్సును క్రమంగా దెబ్బతీసే అల్జీమర్స్ వ్యాధిని ఇకపై కంటి పరీక్ష ద్వారానే ఏళ్ల ముందుగానే గుర్తించే అవకాశం ఉందని అమెరికాలోని హ్యూస్టన్ మెథడిస్ట్ ఆసుపత్రి పరిశోధకులు వెల్లడించారు. మెదడుపై వ్యాధి ప్రభావం కనిపించకముందే కంటిలోని రెటీనా మార్పులను గుర్తించడం ద్వారా అల్జీమర్స్‌ను ప్రారంభ దశలోనే నిర్ధారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పరిశోధకుడు స్టీఫెన్ వాంగ్ ప్రకారం, “కళ్లు మెదడుకు కిటికీలు వంటివి.” ఇప్పటివరకు కంటి పరీక్షల్లో రెటీనా మధ్యభాగంపై మాత్రమే దృష్టి పెట్టేవారని, కానీ అల్జీమర్స్‌కు సంబంధించిన తొలి సంకేతాలు రెటీనా బయటి భాగంలో ఉంటాయని తాజా అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా జ్ఞాపకశక్తి తగ్గిన తర్వాతే వ్యాధి గుర్తిస్తారు. అప్పటికే మెదడులో నరాలు గణనీయంగా దెబ్బతింటాయి. ఈ కొత్త విధానం వల్ల ముందుగానే చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుంది.
అల్జీమర్స్‌కు ప్రధాన కారణంగా భావించే ‘అమిలాయిడ్ ప్రోటీన్’ మెదడులో పేరుకుపోవడం. ఇదే తరహా ప్రోటీన్ కంటిలోని రెటీనాలో కూడా పేరుకుపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కాబట్టి రెటీనాలో జరిగే మార్పులు మెదడులో జరుగుతున్న అనారోగ్య పరిస్థితిని ప్రతిబింబిస్తాయి. భవిష్యత్తులో క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా అల్జీమర్స్ ముప్పును ముందుగానే తగ్గించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!