

కాఫీ లేకుండా చాలా మందికి రోజు మొదలు కాదు. అయితే కాఫీతో తినే కొన్ని ఆహారాలు ఆరోగ్యానికి హానికరం. నిపుణుల ప్రకారం కాఫీలో ఆమ్లాలు, ఉత్తేజకాలు ఉండడంతో, కొన్ని ఆహారాలతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కాఫీతో పాటు 5 రకాల ఆహారాలను దూరంగా ఉంచాలి:
1.నారింజ, నిమ్మ వంటి పుల్లని ఆహారాలు – కడుపులో ఆమ్ల స్థాయి పెంచి గుండెల్లో మంటకు కారణం అవుతాయి.
2.ఫ్రెంచ్ ఫ్రైస్, డోనట్స్, వేయించిన మాంసం – వీటిలోని కొవ్వు, ఉప్పు చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
3.పాల ఉత్పత్తులు – కాఫీ కారణంగా కాల్షియం శరీరం గ్రహించడం తగ్గి ఎముకలపై ప్రభావం పడవచ్చు.
4.అధిక ఉప్పు ఉన్న అల్పాహారం – రక్తపోటు పెరిగే ప్రమాదం ఎక్కువ.
5.తీపి ఆహారాలు – రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగి, వెంటనే పడిపోవటం వల్ల అలసట, చిరాకు కలుగుతుంది.
కాబట్టి కాఫీ తాగే సమయంలో ఈ ఆహారాలను తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిది.
గమనిక :
మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (1)
Useful tip!