
సినిమాలు

గర్భధారణ సమయంలో వచ్చే హైబీపీ సమస్యలు, ముఖ్యంగా గెస్టేషనల్ హైపర్‌టెన్షన్, ప్రీ ఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా వంటి పరిస్థితులు తల్లి, శిశువుల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదంగా మారుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 5-10 శాతం గర్భిణీలు ఈ సమస్యలతో బాధపడుతున్నారని, ఇవి మాతృ మరణాలు మరియు శిశు ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలుస్తున్నాయని తెలిపారు.
స్థూలకాయం, మధుమేహం, ఒత్తిడి, ఆలస్య గర్భధారణ వంటి కారణాలతో ఈ సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. క్రమం తప్పకుండా గర్భిణీ పరీక్షలు, రక్తపోటు పరిశీలన, మూత్ర పరీక్షలు, శిశువు ఎదుగుదల పర్యవేక్షణ చాలా ముఖ్యమని చెప్పారు. తీవ్రమైన తలనొప్పి, వాపులు, చూపు మసకబారడం, కడుపు నొప్పి, శిశువు కదలికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!