

ఉదయం నిద్రలేచిన వెంటనే లేదా ఎక్కువ సమయం ఆకలితో ఉన్నప్పుడు ఖాళీ కడుపుతో కొన్ని పనులు చేయడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌కు ముందు మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నామనే విషయంపై జాగ్రత్త అవసరం. రోజువారీ జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని వారు సూచిస్తున్నారు.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం చాలామందికి అలవాటు. కానీ ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచి జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే, ఆహారం లేకుండా పారాసిటమాల్, ఆస్పిరిన్ వంటి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కడుపు పొరను దెబ్బతీసి గ్యాస్ట్రిక్ బ్లీడింగ్, అల్సర్లకు దారితీస్తుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!