

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని వైద్యులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినొచ్చా అనే సందేహానికి సమాధానంగా, సరైన మోతాదులో ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోవడం మంచిదేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వెల్లుల్లిలో ఉన్న అల్లిసిన్ అనే సమ్మేళనం యాంటీబ్యాక్టీరియల్, క్రిమినాశక గుణాలతో శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. అలాగే ఇందులో ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు, విటమిన్ C, K, ఫోలేట్, నియాసిన్, థియామిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
డాక్టర్ల ప్రకారం, ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడంలో దోహదపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అయితే అలెర్జీలు ఉన్నవారు లేదా కడుపు సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకుని, తక్కువ మోతాదులోనే తీసుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక : మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!