

ఈ రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పొడిని తయారు చేయడానికి ఒక కప్పు నల్ల నువ్వులు, ఒక కప్పు మినప్పప్పు, పావు కప్పు శనగపప్పు తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్స్ మిరియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 10 ఎండు మిర్చి, కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు కలపాలి. ముందుగా అర టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు మిరియాలు, నాలుగు ఎండు మిర్చి వేయించి, ఎక్కువ కాల్చకుండా జాగ్రత్తపడాలి. తర్వాత కరివేపాకు వేసి తేమ పోయే వరకు వేయించాలి. వెల్లుల్లి వేయిస్తే పొడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
అన్ని పదార్థాలు చల్లారిన తర్వాత ముందుగా వేయించిన మసాలాలను కొద్దిగా పొడిలా గ్రైండ్ చేయాలి. తర్వాత పప్పులు, నువ్వులు, కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసి మెత్తగా కాకుండా కొద్దిగా రప్పగా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే రుచిగా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ, రాగి సంగటి, జొన్న రొట్టెలతో కూడా బాగా సరిపోతుంది. నల్ల నువ్వుల్లో కాల్షియం, ఐరన్ అధికంగా ఉండగా, కరివేపాకు మరియు మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!