

బాదం, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ, నానబెట్టిన వాల్‌నట్స్‌ను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే వాల్‌నట్స్‌ను నానబెట్టి తినడం వల్ల పోషకాలు శరీరానికి మరింత మెరుగ్గా అందుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఫైబర్, ప్రోటీన్, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే నానబెట్టిన వాల్‌నట్స్‌ను పోషకాహార నిధిగా డాక్టర్లు అభివర్ణిస్తున్నారు.
వైద్యుల సూచనల ప్రకారం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల నానబెట్టిన వాల్నట్స్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలను తగ్గిస్తాయి. పోషకాహార నిపుణులు ఇవి ఎక్కువ సేపు తృప్తిగా ఉంచడం ద్వారా బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడతాయని చెబుతున్నారు.
డాక్టర్ల ప్రకారం, నానబెట్టిన వాల్నట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటం వల్ల మధుమేహ రోగులకు కూడా ఇవి మేలు చేస్తాయి. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలను బలపరిస్తే, విటమిన్ E చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించి, మెలటోనిన్ కారణంగా మంచి నిద్రకు కూడా ఇవి దోహదపడతాయని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!