

వర్షాకాలంలో చల్లని వాతావరణం కారణంగా కొబ్బరినీళ్లు తాగవచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ కాలంలో కూడా కొబ్బరినీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉన్న యాంటీబాక్టీరియల్ గుణాలు, రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలు వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, వైరల్ జ్వరాలను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. లారిక్ యాసిడ్, విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని రక్షిస్తాయి.
వర్షాకాలంలో జీర్ణక్రియ మందగించినప్పుడు కొబ్బరినీళ్లు ఉపశమనం కలిగిస్తాయి. ఇందులోని పీచు, ఎంజైములు జీర్ణక్రియను మెరుగుపరచి, ఎలక్ట్రోలైట్లను పునరుద్ధరిస్తాయి. అయితే జలుబు, దగ్గు ఉన్నవారు ఉదయం లేదా రాత్రి తాగకపోవడం మంచిది. మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల మధ్య తాజా కొబ్బరినీళ్లు తాగాలి. చల్లగా తాగకూడదు, రోజుకు ఒకటి మాత్రమే తీసుకోవాలి. సరైన విధంగా తీసుకుంటే ఇది ఆరోగ్యం, చర్మం, రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!