

మన శరీరం సక్రమంగా పనిచేయడానికి నీరు అత్యంత అవసరం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం నుంచి జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు నీరు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఏ సమయంలో ఎలాంటి నీరు తాగాలి అనే విషయం చాలా మందికి స్పష్టంగా తెలియదు. వేసవిలో చల్లటి నీరు మంచిదా లేక వేడి నీరు తాగాలా అనే సందేహం తరచూ వస్తుంటుంది. ఈ విషయంపై నిపుణులు మాట్లాడుతూ, పరిస్థితిని బట్టి నీరు తాగే విధానం మారాలని డాక్టర్లు చెప్పారు. ఎక్కువగా చెమటలు పట్టినప్పుడు, ఎండలో ఎక్కువసేపు ఉన్నప్పుడు లేదా తీవ్రమైన దాహం వేసినప్పుడు చల్లటి నీరు తాగితే శరీరానికి త్వరగా ఉపశమనం లభిస్తుందని వారు పేర్కొన్నారు.
అదే సమయంలో జీర్ణక్రియ బలహీనంగా ఉన్నప్పుడు లేదా అజీర్ణం, జలుబు, కఫం, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉన్నప్పుడు వేడి నీరు తాగడం మంచిదని డాక్టర్లు చెప్పారు. మరిగించి చల్లార్చిన నీరు తాగడం ఆయుర్వేదంలో కూడా ఆరోగ్యకరంగా భావిస్తారు. ఈ విధంగా నీరు తాగడం వల్ల శరీరంలోని వాతం, పిత్తం, కఫం వంటి దోషాలు సమతుల్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అయితే ఎక్కువసేపు నిల్వ ఉంచిన నీటిని తాగడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా మరిగించి చల్లార్చిన నీరు తాగడం ఆరోగ్యానికి మంచి ఎంపికగా భావించబడుతుందని వారు తెలిపారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!