

విటమిన్ డి ప్రధానంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. రోజూ కొద్దిసేపు ఎండలో ఉండటం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ డిని సులభంగా పొందవచ్చు. గతంలో ప్రజలు ఎక్కువగా బయటే శారీరక శ్రమ చేసేవారు కాబట్టి వారికి విటమిన్ డి లోపం అరుదుగా కనిపించేది. కానీ ప్రస్తుతం బయట ఎండలో గడిపే సమయం తగ్గిపోవడంతో పిల్లలు, పెద్దలు ఇద్దరిలోనూ విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తోంది. దీని కారణంగా చాలామంది డ్రాప్స్ లేదా ట్యాబ్లెట్లపై ఆధారపడుతున్నారు.
అయితే వైద్యుల సూచన లేకుండా విటమిన్ డి ట్యాబ్లెట్లు వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కొవ్వులో కరిగే విటమిన్ కావడంతో అధికంగా తీసుకుంటే శరీరంలో పేరుకే నిల్వ అయి విషతుల్యంగా మారుతుంది. ఈ పరిస్థితిని విటమిన్ డి టాక్సిసిటీ లేదా హైపర్ విటమినోసిస్ డి అంటారు. దీని వల్ల ఎముకలు బలహీనపడటం, అలసట, కిడ్నీలపై ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. సాధారణంగా రోజుకు 600 ఐయూ చాలు. లోపం ఉన్నవారికి మాత్రమే వైద్యులు నిర్ణయించిన పరిమిత కాలానికి ఎక్కువ మోతాదును సూచిస్తారు. నిర్దేశించిన సమయం పూర్తయ్యాక మళ్లీ పరీక్షలు చేయించుకున్న తరువాతే కొనసాగించాలి.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (1)
డాక్టర్ సలహా తప్పనిసరి.