

విటమిన్ D శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ అని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎముకల బలాన్ని పెంచడమే కాకుండా రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం విటమిన్ D లోపం ఎక్కువగా ఉండటంతో చాలామంది క్యాప్సూల్స్ లేదా టాబ్లెట్ల రూపంలో తీసుకుంటున్నారు. అయితే దీన్ని ఎప్పుడు, ఎలా తీసుకుంటున్నామన్నదే ముఖ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
విటమిన్ D కొవ్వులో కరిగే విటమిన్ కావడంతో గుడ్లు, ఆలివ్ ఆయిల్, అవకాడో, డ్రై ఫ్రూట్స్ వంటి మంచి కొవ్వులు ఉన్న ఆహారంతో కలిపి తీసుకుంటే పోషణ మెరుగ్గా జరుగుతుందని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో తీసుకుంటే ప్రయోజనం తగ్గే అవకాశం ఉంది. అలాగే రాత్రి సమయంలో విటమిన్ D తీసుకుంటే మెలటోనిన్ హార్మోన్‌పై ప్రభావం చూపి నిద్రలేమికి కారణమయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఉదయం పూట లేదా భోజన సమయంలో తీసుకోవడం మంచిదని, మోతాదు విషయంలో తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!