

వర్షాకాలం ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈ సీజన్లో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పండ్ల విషయంలో మరింత శ్రద్ధ అవసరం. వర్షాల కారణంగా కొన్ని రకాల పండ్లు త్వరగా పాడైపోతాయి. వాటిని తింటే కడుపు నొప్పి, అజీర్ణం లేదా జలుబు వంటి సమస్యలు రావచ్చు.
ఈ వర్షాకాలంలో తప్పక నివారించాల్సిన 5 పండ్లు ఏవో, వాటిని ఎందుకు తినకూడదో తెలుసుకుందాం.
పండ్లు తినే ముందు శుభ్రంగా కడిగి, సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉండవచ్చు. వర్షాకాలంలో పండ్లను పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని రకాల పండ్లను ఎంచుకునే విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. కొన్ని పండ్లు ఈ సీజన్లో త్వరగా పాడైపోవడంతో జీర్ణ సమస్యలు రావచ్చు.
పుచ్చ పండు (Watermelon):
వర్షాకాలంలో పుచ్చ పండు, కర్బూజ పండు వంటి వాటి తేమ ఎక్కువగా ఉంటుంది. ఇవి త్వరగా పులిసిపోతాయి. బ్యాక్టీరియా పెరగడానికి ఇవి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. తినడం వలన కడుపులో ఇబ్బందులు రావచ్చు.
పనస పండు (Jackfruit):
పనస పండులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు.
అతిగా పండిన అరటి పండు (Overripe Banana):
వర్షాకాలంలో అరటిపండ్లు త్వరగా పండుతాయి. నిల్వ ఉంచినప్పుడు వాటిపై ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. బాగా పండిన అరటిపండ్లు కడుపు ఉబ్బరం, అజీర్ణం కలిగించవచ్చు.
అనాస పండు (Pineapple):
అనాస పండులో సహజంగానే అధిక ఆమ్లత్వం ఉంటుంది. ఇది వర్షాకాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను పెంచుతుంది. అలాగే ఆమ్ల గుణం వల్ల కడుపులో ఇబ్బంది కలగవచ్చు.
లిచి (Litchi):
లిచి పండు త్వరగా పులిసిపోతుంది. తాజాగా లేకపోతే కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది. వర్షాకాలంలో లిచి సులభంగా చెడిపోతుంది కాబట్టి దూరంగా ఉండటం మంచిది.
వర్షాకాలంలో మామిడి పండ్లు తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. ఇది కూడా జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అందుకే మితంగా మాత్రమే తీసుకోవాలి.
ఈ పండ్ల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
గమనిక: ఈ కథనం సాంప్రదాయ ఆహార నియమాలు మరియు సాధారణ నమ్మకాల ఆధారంగా ఉంది; దీనికి శాస్త్రీయ ధ్రువీకరణ లేదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఆహారంలో మార్పులు చేసే ముందు వైద్యుడు లేదా ఆహార నిపుణుడిని సంప్రదించాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!