
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 నేపథ్యంలో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ తన తమిళగ వెట్రి కజగం తరఫున తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఈ రెండు చోట్ల గెలిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఖాళీ అయ్యే స్థానానికి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ లేదా నటి త్రిష కృష్ణన్‌ను బరిలోకి దింపే అవకాశముందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల త్రిష విజయ్ను ఆయన నివాసంలో కలవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!