

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ‘ఓజీ’ సీక్వెల్ ఒకటి. ఇటీవల ‘ఓజీ 2’ గురించి అధికారికంగా ప్రస్తావన రావడంతో ఈ చిత్రంపై మళ్లీ చర్చ మొదలైంది. ఇంకా సినిమా ప్రారంభానికి సమయం ఉన్నప్పటికీ, నిర్మాణ భాగస్వాముల వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.మొదటి భాగాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సీక్వెల్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ హోమ్ బ్యానర్ కొత్త భాగస్వామిని వెతుకుతున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్‌కు బలమైన నిర్మాణ సంస్థ అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుజిత్ ప్రస్తుతం పలువురు ప్రముఖ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా యువీ క్రియేషన్స్ పేరు బలంగా వినిపిస్తోంది.
పెద్ద బడ్జెట్ చిత్రాల నిర్మాణంలో అనుభవం ఉన్న ఈ సంస్థ సీక్వెల్‌కు సరైన ఎంపికగా భావిస్తున్నట్లు టాక్.
అంతేకాదు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాత రామ్ తాళ్లూరి సంస్థల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని సమాచారం. వీటిలో ఏదో ఒక సంస్థ అధికారికంగా జట్టులో చేరే అవకాశం ఉందని అంటున్నారు.అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిర్మాతల వ్యవహారంపై స్పష్టత వచ్చిన తర్వాతే తదుపరి షెడ్యూల్స్, చిత్రీకరణ ప్రణాళికలు ఖరారు కానున్నాయి. మరో రెండు నెలల్లో ఈ అంశంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ‘ఓజీ 2’ చుట్టూ ఊహాగానాలు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!