

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్‌గా మారి సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేశాయి. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన ట్యూన్లు ఫ్యాన్స్ కి బాగా నచ్చాయి.
అయితే ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం ఒకే విషయంపై ఉంది — “టీజర్ ఎప్పుడు వస్తుంది?” అని. పాటలు బాగున్నాయి కానీ అసలు సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే టీజర్ తప్పనిసరిగా రావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోతో అనిల్ రావిపూడి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అందించబోతున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో పెరుగుతోంది.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా నుంచి టీజర్ లేదా ట్రైలర్ ఏదైనా వస్తే సోషల్ మీడియాలో పక్కా సంచలనం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ మెగా ట్రీట్ ఎప్పుడు అందిస్తారో చూడాలి!


.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!