
జనరల్

కేరళలో కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై చర్చలు వేగం అందుకున్నాయి. వి.డి.సతీశన్ కు సీఎం పదవికి ఎక్కువ అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో రమేష్ చెన్నితాల, కేసి వేణుగోపాల్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారని సమాచారం. త్వరలోనే అధిష్టానం అధికారికంగా సీఎం అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28.79 శాతం ఓట్లతో 63 సీట్లు సాధించింది. సిపిఎం 21.77 శాతం ఓట్లతో 26 సీట్లు గెలుచుకోగా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 11.01 శాతం ఓట్లతో 22 సీట్లు సాధించింది. ఈ ఫలితాల నేపథ్యంలో కేరళ రాజకీయాల్లో సీఎం ఎంపికపై ఆసక్తి పెరిగింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!