

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలంటూ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు సుమారు లక్షన్నర మంది ఉద్యోగులు సామూహిక సెలవులు పెట్టి నిరసనలో పాల్గొన్నారు. మంగళవారం సెలవు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం రాత్రి వరకు ఉద్యోగులు సామూహిక సెలవుల దరఖాస్తులు సమర్పించారు. పాత పింఛన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ ఉద్యమంలో భాగమయ్యారు.
ఉపాధ్యాయులతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, వ్యవసాయ, అటవీ, పశుసంవర్ధక, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, న్యాయశాఖలకు చెందిన ఉద్యోగులు సామూహిక సెలవులు పెట్టారు. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ కోరుతూ తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్‌ఈయూ) ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన చేపట్టారు. 2023 నవంబర్ 17న విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. మేనిఫెస్టో డేను పురస్కరించుకుని, మూడేళ్ల క్రితం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని నిరసిస్తూ సీపీఎస్‌ఈయూ సామూహిక సెలవులతో పాటు ధర్మదీక్ష సభలకు పిలుపునిచ్చింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!