

అమెరికాలో పలు ప్రముఖ బ్యాంకుల సేవలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో, ట్రూయిస్ట్ బ్యాంకుల్లో కొన్ని సేవలు నిలిచిపోయాయి. దీంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రముఖ డిజిటల్ పేమెంట్ నెట్‌వర్క్ జెల్లే సేవలు కూడా ప్రభావితమయ్యాయి. నగదు బదిలీలు, ఇతర ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడంలో వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నట్లు సమాచారం.
సిస్టమ్‌లో తలెత్తిన బగ్ కారణంగానే సేవలకు అంతరాయం ఏర్పడిందని జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్ వెల్లడించింది. డిజిటల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ చెల్లింపులపై ఆధారపడే ఖాతాదారులకు ఈ సాంకేతిక సమస్యతో అసౌకర్యం కలిగింది. బ్యాంకింగ్ సేవల్లో సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడటం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన డిజిటల్ చెల్లింపుల నెట్‌వర్క్‌ల విశ్వసనీయతపై మరోసారి చర్చకు దారితీసింది. అంతరాయానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రభావితమైన సేవల పునరుద్ధరణపై మరింత సమాచారం వెల్లడికావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!