
క్రీడలు

‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రితికా నాయక్, ‘హాయ్ నాన్న’ సినిమాలో క్లైమాక్స్ ఎంట్రీతో గుర్తింపు పొందారు. ‘మిరాయ్’తో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రితికా ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘డ్యూయెట్’, ‘కొరియన్ కనకరాజు’ చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇప్పుడు ఆమెకు మరో భారీ అవకాశం దక్కినట్లు సమాచారం. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న రాజకీయ యాక్షన్ డ్రామా ‘పవర్ పేట’ లో రితికా నాయక్ హీరోయిన్గా ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో, 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!