

సినిమా రంగంలో జయాపజయాలు సహజమే. దర్శకుడు శంకర్ తన తొలి చిత్రం జెంటిల్మెన్ తో ఘన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ముదల్వన్, బాయ్స్, ఇండియన్, రోబో, నన్బన్ (స్నేహితులు), అన్నియన్ (అపరిచితుడు), శివాజీ ఇలా వరుసగా బ్రహ్మాండమైన చిత్రాలతో తమిళ సినిమాను భారతీయ చిత్రాల స్థాయికి తీసుకెళ్లారు. అయితే, ఇటీవలి కాలంలో ఆయన కొన్ని సినిమాలు, ముఖ్యంగా ఇండియన్ 2 మరియు గేమ్ ఛేంజర్, బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.
ఇకపోతే ఈసారి శంకర్ చారిత్రక కథను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. వేల్చారి అనే నవల ఆధారంగా శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. అందుకు సంబంధించిన ప్రీపొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోగా సూర్య నటించే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. సూర్య ఇప్పటివరకు శంకర్ దర్శకత్వంలో నటించలేదు.
సూర్య వేల్చారి లో నటిస్తే, సినిమా క్రేజ్ ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో చూడాలి! ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు త్వరలో రిలీజ్ కానుంది. అలాగే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత మలయాళ దర్శకుడితో ఓ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.



.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!