

‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంతో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోయిన్ విషయంలో ఇప్పటికే పలువురు పేర్లు వినిపించగా, తాజాగా ‘రొమాంచకం’ బ్యూటీ అనంతిక సనిల్‌కుమార్ పేరు బలంగా వినిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్, అనంతికతో మేకర్స్ ఫొటోషూట్ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే సాయిపల్లవి, కీర్తి సురేష్, రష్మిక మందన్నా, కృతి శెట్టి పేర్లు కూడా హీరోయిన్‌గా వినిపించాయి. తెలంగాణ ప్రాంతీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ కథ గ్రామదేవత చుట్టూ సాగుతుందని సమాచారం. రంగస్థల కళాకారుడైన పర్షి ఎల్లమ్మగా మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎల్లమ్మ ఎవరు, ఆమెకు పర్షి కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటన్నదే కథలో కీలకంగా ఉండనుంది. ‘బలగం’ తరహాలో తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా ఎలా కనిపిస్తారనే ఆసక్తి కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. అయితే హీరోయిన్‌గా అనంతిక నటిస్తున్నారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!