

ఇటీవలి సినిమాల ఫలితాల తర్వాత బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కథల ఎంపికలో కొత్త మార్గాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కల్నల్ సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మాతృభూమి చిత్రంలో నటిస్తున్నారు. ఇదే సమయంలో దర్శకుడు వంశీ పైడిపల్లితో మరో చిత్రానికి కూడా అంగీకరించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాధారణ యాక్షన్ కథలకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్‌లను ఎంపిక చేసుకునే దిశగా సల్మాన్ అడుగులు వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇక దర్శక ద్వయం రాజ్ & డీకే రూపొందించిన సూపర్ హీరో కామెడీ కథకు సల్మాన్ ఖాన్ ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల రాజ్ ఒక కొత్త హిందీ ప్రాజెక్ట్ గురించి సంకేతాలు ఇచ్చినా, పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఇదే సమయంలో ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సోషల్ మీడియా పోస్టుకు సమంత లైక్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ చిత్రంలో సమంత నటిస్తుందా లేదా అనే విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయినప్పటికీ ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!