

పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. పుష్పరాజ్ పాత్రలో ఆయన చూపించిన మేనరిజమ్స్, నటన ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశాయి. ఇంతగా పాపులర్ అయిన ఇమేజ్‌ను దాటి పూర్తిగా భిన్నమైన రూపంలో ప్రేక్షకుల ముందుకు రావడం సవాలుతో కూడుకున్నదే. అయితే దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న రాకా సినిమాతో బన్నీ అదే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్పరాజ్ పాత్రకు ఎలాంటి పోలికలు లేకుండా ఈ సినిమాలో కొత్త ప్రపంచాన్ని చూపించనున్నట్లు సమాచారం.
రాకా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్ దివ్య యోధుడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ పాత్ర కోసం గుండు, గ్రే హెయిర్‌తో పాటు ప్రోస్తెటిక్ మేకప్‌తో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ లుక్ మార్పుతో రాకా ద్వారా బన్నీకి మరో పవర్‌ఫుల్ ఇమేజ్ దక్కుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!