

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో నిర్మించిన భారీ కాశీ సెట్‌ను నెటిజన్లు యాపిల్ మ్యాప్స్‌లో గుర్తించారు. ఇటీవల అప్‌డేట్ అయిన మ్యాప్స్‌లో కనిపించిన ఈ సెట్ ఏరియల్ వ్యూను చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
ప్రాచీన కాశీ నగరాన్ని తలపించేలా ఆలయాలు, ఘాట్లతో ఈ సెట్‌ను భారీ స్థాయిలో నిర్మించినట్లు తెలుస్తోంది. భారతీయ పురాణాల నేపథ్యంతో టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మహేశ్ బాబు రుద్రగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా కనిపించనున్నారు. సినిమా షూటింగ్ పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!