

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వృషకర్మ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘విరూపాక్ష’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ దండు ఈ మిస్టికల్ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌పై ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. ‘వృషకర్మ’ నిడివి మూడు గంటలకు పైగా ఉండొచ్చని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు ఇంత సుదీర్ఘ నిడివితో రావడం అరుదు కావడంతో ఈ ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. అయితే చిత్ర బృందం నుంచి దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాతే అసలు రన్‌టైమ్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా, స్పర్ష్ శ్రీవాస్తవ, జయరామ్, కియారా ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!