

ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్-2026లో ప్రధాని నరేంద్ర మోదీ ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన ప్రాంతీయ నేతల్లో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే మూడు స్థానాలు మెరుగుపడ్డారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మొదటి స్థానంలో నిలిచారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 27 దేశాల శక్తి సామర్థ్యాలను 131 సూచికల ఆధారంగా ఈ నివేదిక అంచనా వేసింది.
దేశాల మొత్తం ర్యాంకింగ్స్‌లో భారత్ 40.5 పాయింట్లతో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. అమెరికా 78.9 పాయింట్లతో మొదటి స్థానంలో, చైనా 73.6 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. జపాన్ 38.6 పాయింట్లతో భారత్ తర్వాత నిలిచింది. దౌత్య ప్రభావం, రక్షణ భాగస్వామ్యాలు, సాంస్కృతిక ప్రభావం, భవిష్యత్ వనరుల విభాగాల్లో భారత్ పురోగతి సాధించినట్లు నివేదిక పేర్కొంది. నాయకత్వంలో స్థిరత్వం, విదేశాంగ విధానంలో కొనసాగింపు మోదీ ర్యాంకింగ్ మెరుగుపడటానికి కారణాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ నివేదికపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హర్షం వ్యక్తం చేయగా, భారత్ అంతర్జాతీయంగా ఎదుగుతోందనడానికి ఇది గుర్తింపు అని బీజేపీ నేతలు పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!