

టాలీవుడ్లో కథానాయకుడిగా మాత్రమే కాకుండా, వ్యక్తిత్వంతోనూ అభిమానుల మనసులు గెలుచుకున్న నటుల్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ఈ ఏడాది ఆయన నటించిన ‘ది రాజా సాబ్’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. గతంలో ‘ఆదిపురుష్’ కారణంగా ఎదురైన నష్టాల నేపథ్యంలో నిర్మాత విశ్వప్రసాద్కు ప్రభాస్ మరో అవకాశం ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రయత్నం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
ఇప్పుడు మరోసారి ప్రభాస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో కొత్త చిత్రం రానున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి కలయికలో 2028లో మరో సినిమా ఉంటుందని ఖరారైనట్లు తెలుస్తోంది. వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాణ సంస్థకు ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన విశాల హృదయానికి నిదర్శనమని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈసారి అయినా వీరి కలయికలో భారీ విజయం నమోదవుతుందా? గత ఫలితాలను అధిగమించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారా? అన్నది వేచి చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!