

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘రాకా’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే 23వ చిత్రంపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. ఈ చిత్రాన్ని కూడా లోకేష్ తనకు బాగా పట్టున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ కథాంశంతో రూపొందించనున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ పెరుగుతోంది.
లోకేష్ గత చిత్రాలను పరిశీలిస్తే ‘కూలీ’ మినహా ఎక్కువ సినిమాల్లో గ్యాంగ్‌స్టర్ నేపథ్యాన్నే ప్రధానంగా చూపించారు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో కూడా అలాంటి కథనే తెరకెక్కిస్తే, ఆయన సినిమాటిక్ ప్రపంచంలోకి ఐకాన్ స్టార్ అడుగుపెట్టినట్లవుతుంది. ఇదే నిజమైతే ఈ కలయికపై అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయం. ఇప్పటికే అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉండగా, లోకేష్‌కు కూడా ప్రత్యేకమైన ప్రేక్షకాదరణ ఉంది. వీరిద్దరి కలయికలో ఎలాంటి కథను సిద్ధం చేస్తున్నారు? ఈ సినిమా ఆయన సినిమాటిక్ ప్రపంచంలో భాగమవుతుందా? అనే ప్రశ్నలకు అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!