

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్! ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. లెక్క ప్రకారం ఈ నెల 26 న థియేటర్లలోకి రావాలి. కానీ ఓ వారం ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా 19 నే రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్‌గానే ప్రకటించారు. అయితే ముందుగా ప్లాన్ చేసిన ప్రీమియర్ షోల విషయంలో మాత్రం చిత్రబృందం వెనక్కి తగ్గినట్లు సమాచారం.
‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ సినిమా చాలా కాలం క్రితమే ప్రకటించారు. గత ఏడాది చివర్లో షూటింగ్ పూర్తయింది. మొదటగా ఈ నెల 18 రాత్రి ప్రీమియర్లు వేయాలని భావించారు. కానీ డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థనతో ఆ నిర్ణయాన్ని మార్చి, ఈ నెల 19 ఉదయం 7 గంటల నుంచి మాత్రమే సాధారణ షోలు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇలా ప్రీమియర్లు రద్దు చేయడానికి సినిమా పై ఉన్న హైప్ కూడా ఒక కారణమై ఉండొచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు పెద్దగా స్పందన పొందలేదు. ట్రైలర్ వచ్చిన తర్వాతే ప్రేక్షకులు సినిమాపై పూర్తి అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతున్న డబ్బింగ్ సినిమా ‘ధురంధర్ 2’ పై మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఈ సినిమా ప్రీమియర్లు ఈ నెల 18 సాయంత్రం 5 గంటల నుంచి దేశవ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, ముఖ్యంగా హైదరాబాద్‌లో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. దాదాపు నాలుగు గంటల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాతో పోల్చితే ప్రేక్షకుల దృష్టి ఎటు మళ్లుతుందో అనే సందేహం కూడా ఉంది. అందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ ప్రీమియర్ల విషయంలో రిస్క్ తీసుకోలేదేమో అన్న అభిప్రాయం వినిపిస్తోంది.



.jpg&w=3840&q=75)



.jpeg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!