
టెక్నాలజీ

దర్శకుడు మణిరత్నం ఇటీవల కమల్ హాసన్‌తో చేసిన థగ్ లైఫ్ సినిమాతో పెద్ద పరాజయం ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ విజయ్ సేతుపతితో కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఇద్దరూ ఇంతకుముందు 2018లో విడుదలైన చెక్క చివంత వానం చిత్రంలో కలిసి పనిచేశారు.
ఈ కొత్త సినిమాకి సంబంధించిన కథను మణిరత్నం మొదట సిలంబరసన్ (STR)కి వినిపించారట. కానీ ప్రస్తుతం STR తన అరసన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో, ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా విజయ్ సేతుపతిని తీసుకోవాలని మణిరత్నం నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయట. హీరోయిన్గా విజయ్ సేతుపతితో ఏస్ సినిమాలో నటించిన రుక్మిణి వసంత్‌తో చర్చలు తుదిదశకు చేరుకున్నాయని సమాచారం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!