

సినిమా ఇండస్ట్రీలో రూమర్లు, గాసిప్స్ కొత్తవి కాదు. ముఖ్యంగా సినీ తారలకు సంబంధించిన ఊహాగానాలు, ప్రచారాలు ఎప్పుడూ ఆసక్తిని రేపుతుంటాయి. ఈ నేపథ్యంలో కొందరు జర్నలిస్టులు, క్రిటిక్స్ లీకుల పేరుతో ఇలాంటి విషయాలను బయటపెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. ఇదే కోవలో బాలీవుడ్లో వివాదాస్పద జర్నలిస్టు, క్రిటిక్, నటుడు కమల్ ఆర్ ఖాన్ (KRK) తాజాగా ఓ సంచలన అంశాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఓ దర్శకుడు, నిర్మాత మధ్య జరిగిన వ్యవహారాన్ని గాసిప్‌గా బయటపెట్టిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
KRK గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే… హిందీ సినిమా ఇండస్ట్రీలో ఆయన అత్యంత వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు పొందారు. తన వీడియోలు, ట్వీట్ల ద్వారా బాలీవుడ్లో సంచలన విషయాలు, ఫేక్ బాక్సాఫీస్ నంబర్లు, తారల మధ్య సంబంధాలపై వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఓ హౌసింగ్ కమ్యూనిటీలో కాల్పులకు పాల్పడ్డారనే కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. కొన్ని రోజుల రిమాండ్ అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.
బయటకు వచ్చిన వెంటనే KRK తన పాత శైలిలో మరో వివాదానికి తెరలేపారు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన కృతి శెట్టిని లక్ష్యంగా చేసుకుని ఆయన ఓ ట్వీట్ చేశారు. ఓ సినిమా హీరోయిన్ ఎంపిక విషయంలో దర్శకుడు, నిర్మాత మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని పేర్కొన్నారు. నిర్మాత మాత్రం కృతిశెట్టిని ఆ సినిమాతో బాలీవుడ్లో లాంచ్ చేయాలని భావించాడట. అయితే దర్శకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను హీరోయిన్గా తీసుకోవాలని పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు KRK ట్వీట్లో పేర్కొన్నారు.
అంతేకాదు, కృతిశెట్టిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు ఎంపిక చేసుకోవాలనుకున్న గర్ల్‌ఫ్రెండ్ అయినా, కృతిశెట్టి అయినా పెద్దగా ప్రయోజనం ఉండదని, ఇద్దరూ హారిబుల్ హీరోయిన్సేనని వ్యాఖ్యానించారు. కృతిశెట్టికి పూర్తిగా సౌత్ హీరోయిన్ లుక్ మాత్రమే ఉందని, హిందీ ప్రేక్షకులకు ఆమె నచ్చదని కూడా ఆయన విమర్శించారు. కృతిశెట్టి ఫోటోతో చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో అసలు ఆ నిర్మాత, దర్శకుడు ఎవరు అనే అంశంపై నెటిజన్లు, సినీ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!