

బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ, హీరోగా కూడా తనదైన స్థానం సంపాదించుకున్నాడు. ‘ఓ బేబీ’లో కీలక పాత్ర తర్వాత ‘జాంబి రెడ్డి’తో హీరోగా నిలదొక్కుకున్న తేజ కెరీర్ను ‘హనుమాన్’ సినిమా పూర్తిగా మార్చేసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. దీని తర్వాత ‘మిరాయ్’తో మరో విజయాన్ని అందుకున్నాడు.
ప్రస్తుతం తేజ నటించిన చివరి మూడు చిత్రాలకు సీక్వెల్స్ రాబోతున్నాయి. ‘జాంబి రెడ్డి–2’, ‘మిరాయ్–2’ చిత్రాల్లో తేజే హీరోగా నటించనున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించాడు. అయితే ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’లో తాను నటిస్తానా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ చిత్రం పూర్తిగా హనుమంతుడి పాత్ర చుట్టూ తిరుగుతుందని, ఆ పాత్రను రిషబ్ శెట్టి పోషించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయినా కూడా సీక్వెల్ కావడంతో తేజ పాత్ర ఉంటుందా అనే ఆసక్తి కొనసాగుతోంది. సినిమా నిర్మాణ సమయంలో మార్పులు జరిగితే తేజ కొన్ని సన్నివేశాల్లో కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!