

కేజీఎఫ్ సినిమా తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్, రెండు భాగాలతో భారీ సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలం వరకు మరో సినిమా చేయకుండా మంచి కథ కోసం ఎదురు చూశాడు. ఇప్పుడు టాక్సిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో యష్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించడం మరో ప్రత్యేకత. కియారా అద్వానీ, నయనతార, హ్యూమ ఖురేషి ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే వీరి పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్లు విడుదల చేశారు. కియారా అద్వానీ పాత్ర పేరు నదియా కాగా, హ్యూమ ఖురేషి పాత్ర పేరు ఎలిజబెత్. తాజాగా నయనతార పాత్ర పేరు గంగ అని వెల్లడించారు.
ఈ పోస్టర్లను గమనిస్తే, ముగ్గురు హీరోయిన్లు మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. వారి పేర్ల ద్వారానే వారు వేర్వేరు నేపథ్యాలకు చెందినవారని అర్థమవుతోంది. టాక్సిక్ సినిమాతో యష్ మరోసారి భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు, మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టిని తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కేజీఎఫ్ తర్వాత పెద్ద దర్శకుల నుంచి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, ఆయన చాలా సంవత్సరాల పాటు వేచి చూసి ఈ సినిమాను ఎంపిక చేశాడు. ఈ సినిమా ఘన విజయం సాధిస్తే యష్ క్రేజ్ మరోసారి ఆకాశాన్ని తాకుతుందనే చెప్పాలి.
ఇదిలా ఉండగా, బాలీవుడ్లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో కూడా యష్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రతో ఆయన ఎలాంటి గుర్తింపు సంపాదిస్తాడో చూడాలి. రావణాసురుడిగా ఆయన విలనిజాన్ని ఏ స్థాయిలో చూపిస్తాడన్నది ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చగా మారింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!