
న్యూస్

ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచంలో భారీ ఆసక్తిని తెచ్చుకున్న చిత్రం ఏదైనా ఉందంటే, అది సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కలిసి చేస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాను చాలా పెద్ద స్థాయిలో ప్లాన్ చేశారు. ఇప్పటికే సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందని ఖరారైంది.
అయితే విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ డేట్ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే మార్చి 26న ఈ కీలక ప్రకటన ఉండవచ్చని టాక్. దీనిపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!