
ఓటీటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది ఏ సినిమా రీ రిలీజ్ అవుతుందనే ఆసక్తి అభిమానుల్లో భారీగా నెలకొంది. గత కొన్ని రోజులుగా ‘బద్రి’ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ‘పంజా’ సినిమానే థియేటర్లలోకి మళ్లీ రానున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పవన్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
‘పంజా’ సినిమా స్టైలిష్ యాక్షన్ డ్రామాగా అప్పట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే కొందరు అభిమానులు ‘బద్రి’ రీ రిలీజ్ అయితే మరింత బాగుండేదని భావిస్తుండగా మరికొందరు ‘పంజా’ మూవీ థియేటర్లలో మరోసారి మాస్ ఫీవర్ తీసుకువస్తుందని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!