

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి సోషల్ మీడియా లో ఏ చిన్న లీక్ వచ్చినా వైరల్ గా మారిపోతోంది. దేశవ్యాప్తంగా సినిమాకి సంబంధించిన చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 40 శాతం వరకు పూర్తి అయ్యిందట. ఇప్పుడు తీసిన సన్నివేశాల్లోనే కొన్ని అల్లు అర్జున్ అంచనాలకు చేరకపోవడంతో రీ షూట్స్ చేస్తున్నారు. హీరోయిన్స్ గా దీపికా పడుకొనే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. మరోవైపు రష్మిక మందాన విలన్ క్యారెక్టర్ లో కనిపించనుంది. దీపికా, అల్లు అర్జున్, మృణాల్ తో కొన్ని సన్నివేశాలు ఇప్పటికే షూట్ అయ్యాయి, కానీ జాన్వీ, రష్మిక ఇంకా సెట్స్ లోకి చేరలేదు.
ఇక ప్రత్యేక పాత్ర కోసం బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ను డైరెక్టర్ అట్లీ సంప్రదించారని సమాచారం. టైగర్ ష్రాఫ్ డ్యాన్స్ లో అల్లు అర్జున్ కి ఏ మాత్రం తీసిపోడు. ఇక ఫైట్స్ విషయం లో అయితే అల్లు అర్జున్ ని మించినోడు ఈయన. వీళ్ళ కాంబినేషన్ లో డ్యాన్స్, ఫైట్స్ పడితే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇందులో టైగర్ ష్రాఫ్ పాజిటివ్ క్యారక్టర్ చేస్తున్నాడా?, లేదా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడా? అనేది ఇంకా బయటకు రాలేదు కానీ, వీళ్ళ కాంబినేషన్ లో మంచి దమ్మున్న సన్నివేశాలు తీస్తే మాత్రం వేరే లెవెల్ లో ఉంటాయని చెప్పొచ్చు. తదుపరి కొత్త షెడ్యూల్ లో టైగర్ ష్రాఫ్ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన రెమ్యునరేషన్ సుమారు 30 కోట్ల రూపాయిల వరకు అని వార్తలు ఉన్నాయి, ఇది పెద్ద స్క్రీన్ టైం ఉన్న పాత్ర కావడానికి సంకేతం.
ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒక క్యారెక్టర్ నెగిటివ్ గా ఉంటుందట. రెండు ప్రపంచంలో పెరిగిన అన్నదమ్ముల కథ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అట్లీ. ఇన్ని రోజులు కేవలం కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన అట్లీ , ఇప్పుడు ఒక్కసారిగా ఇలా సైన్స్ ఫిక్షన్ జానర్ లో సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఎంత వరకు ఆయన సమర్థవతంగా తీస్తున్నాడు అనేది టీజర్, లేదా గ్లింప్స్ వీడియో చూస్తే కానీ ఒక క్లారిటీ రాదు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!