

టాలీవుడ్లో విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పురాణ నేపథ్యంతో కూడిన డార్క్ రివేంజ్ యాక్షన్ కథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ నటి కృతి సనన్ నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో సినిమాను తెరకెక్కించేందుకు హాలీవుడ్ సాంకేతిక నిపుణులను కూడా రంగంలోకి దింపాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ముందస్తు పనులు వేగంగా సాగుతున్నాయి.
దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో కృతి సనన్ పేరు ముందుకు వచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే నటి రష్మిక మందన్న సూచనతోనే కృతి పేరు మేకర్స్ దృష్టికి వెళ్లిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!