
ఓటీటీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మే 23న భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ దసరా గ్రౌండ్స్‌లో గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ ఈ కార్యక్రమంలో లైవ్ ప్రదర్శన ఇవ్వనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ కాన్సర్ట్ కోసం ముంబై నుంచి రూ.150 కోట్ల విలువైన అత్యాధునిక మ్యూజిక్ ఎక్విప్మెంట్ను తీసుకొస్తున్నట్లు సమాచారం. అద్దె ఖర్చులకే దాదాపు రూ.1 కోటి వెచ్చిస్తున్నారని తెలుస్తోంది. అలాగే శృతి హాసన్ నటించిన ప్రత్యేక పాటను కూడా ఈ ఈవెంట్లో విడుదల చేయనున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!