

సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బాలయ్య చాలా తక్కువ సమయంలోనే మాస్ హీరోగా అవతరించాడు. కమర్షియల్ సినిమాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెరకెక్కుతున్న ఈ కొత్త సినిమా కూడా మాస్ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది.
ఈ సినిమాలో రజనీకాంత్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల బాలయ్య మరియు దర్శకుడు రజనీకాంత్‌ను కలిసి కథ చెప్పినట్లు సమాచారం. ఆ కథ ఆయనకు నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా, ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర నెగెటివ్ షేడ్స్‌లో ఉంటుందని, అది సినిమా మొత్తానికి హైలెట్ అవుతుందని చెబుతున్నారు.
‘రోబో’ సినిమా తర్వాత రజనీకాంత్ పూర్తిగా విలన్ పాత్రలో కనిపించలేదు. ఇప్పుడు ఈ సినిమాలో ఆయన నెగెటివ్ పాత్రలో ఎలా కనిపిస్తారో చూడాలి. ప్రస్తుతం ఆయన నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ లో నటిస్తున్నారు. అలాగే కమల్ హాసన్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ బిజీ షెడ్యూల్ మధ్య కూడా బాలయ్య పై ఉన్న అభిమానం, గౌరవంతో ఈ సినిమాకు ఒప్పుకున్నారని వార్తలు చెబుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!