
టెక్నాలజీ

‘టాక్సిక్’ చిత్రంలో నదియా పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న కియారా అడ్వాణీ, మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ఆమె, వృత్తిపరంగా మరో మహిళా ప్రాధాన్య కథలో నటించనున్నట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘బరేలీ కీ బర్ఫీ’, ‘పంగా’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన అశ్వినీ అయ్యర్ తివారి దర్శకత్వం వహించనున్నారు.
ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, కియారా మరియు దర్శకురాలి మధ్య చర్చలు పూర్తైనట్లు తెలుస్తోంది. ‘టాక్సిక్’ చిత్ర షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఈ కొత్త చిత్రాన్ని ప్రారంభించాలనే యోచనలో చిత్రబృందం ఉంది. శక్తివంతమైన మహిళా పాత్ర చుట్టూ కథ సాగనుందని సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!