

బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్, ప్రముఖ నిర్మాత వాసు భగ్నానీ, ప్యానోరమా స్టూడియోస్‌కు సంబంధించిన ముంబయిలోని 12 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. సినిమా ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు విదేశాలకు తరలించారనే అనుమానాలపై ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. అధికారులు ఆర్థిక రికార్డులు, పత్రాలు, విదేశీ లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నమోదైన డ్రగ్స్ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈగల్ ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో కొకైన్, ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్న అనంతరం, పోలీసుల విచారణలో అమన్ ప్రీత్ సింగ్‌ను అనుమానిత వినియోగదారుగా గుర్తించారు. అయితే ఆ కేసుకు ప్రస్తుత ఆదాయపు పన్ను శాఖ సోదాలకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు సమాచారం లేదు. ప్రస్తుత ఐటీ దర్యాప్తులో రకుల్ ప్రీత్ సింగ్‌పై ఎలాంటి తప్పిదం అధికారికంగా నిర్ధారించబడలేదు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!