

సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ వారణాసి (Varanasi). మిథాలజీ, సైన్స్ ఫిక్షన్ జోనర్ కలయికతో రూపొందుతుండటంతో ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే పాన్ వర్డల్ లెవెల్లో భారీ అంచనాలు సృష్టించిన ఈ మూవీ చుట్టూ రోజురోజుకూ ఆసక్తికర వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ రాజమౌళి విజన్ ఏంటో అందరీకి అర్థమై ఉంటుంది. ఈ మూవీలో కథానుగుణంగా యంగ్ మహేశ్ బాబు రోల్ ఉండబోతుందట. అయితే.. యంగ్ మహేష్ బాబు పాత్ర మరి ఎవరు కనిపించబోతున్నారో తెలుసా ?
"వారణాసి" సాధారణ హై బడ్జెట్ సినిమా కాదు. రాజమౌళి- మహేష్ బాబు కలయిక కావడంతోనే కాదు, జానర్ కారణంగానూ ఈ ప్రాజెక్ట్ వరల్డ్ మార్కెట్ లక్ష్యంగా రూపొందుతోంది. టైటిల్ గ్లింప్స్‌లో కనిపించిన పురాణాల ఆధారిత యుద్ధ వాతావరణం, హనుమాన్ ఎలిమెంట్స్, మిథాలజీకల్ ఫ్యూజన్.. ఇవి సినిమా హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందనే సంకేతం ఇస్తున్నాయి. అంతే కాదు.. "మహేష్ రాముడి అవతారంలో కనిపిస్తాడు." స్వయంగా రాజమౌళి ప్రకటించడంతో మరింత హైప్ క్రియేట్ అయింది.
సినిమా కథనం ప్రకారం రుద్ర (మహేష్ బాబు పాత్ర) చిన్నతనాన్ని కూడా చూపించే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని ఇండస్ట్రీ టాక్. అదే పాత్రను యంగ్ మహేష్‌గా టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్ పోషించబోతున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక స్టేట్మెంట్ రాకపోయినా, ఈ వార్త ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దర్శన్ ఇప్పటికే 'ఫౌజీ' సినిమాలో యంగ్ ప్రభాస్ పాత్ర పోషిస్తున్నాడు. అతని ఫోటోలు, లుక్స్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చకు వస్తుంటాయి. జూనియర్ మహేష్ బాబుగా నటించే అవకాశం దక్కితే మాత్రం మాస్టర్ దర్శన్ ఓవర్‌నైట్ స్టార్ అవుతాడనడంతో ఎలాంటి సందేహం లేదు. గతంలో గౌతమ్ ఘట్టమనేని 'నేనొక్కడినే'లో జూనియర్ మహేష్ బాబు పాత్ర పోషించి భారీ స్పందన పొందాడు. ఇప్పుడు అదే మ్యాజిక్ దర్శన్‌తో రిపీట్ అవుతుందా అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!