

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా డ్రాగన్. ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను పూర్తిగా కొత్తగా చూపించబోతున్నారని సమాచారం. రవి బస్రూర్ అందించే నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని భావిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్. అలాగే రుక్మిణి వసంత్ మరో హీరోయిన్గా ఇప్పటికే ఖరారైంది. తాజాగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. RRR సినిమాలో జెన్నీ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఒలివియా మోరిస్, ఎన్టీఆర్‌తో మళ్లీ జోడీగా కనిపించనుందన్న ప్రచారం సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేకపోయినా, ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయితే గ్లోబల్ స్థాయిలో సినిమాకు భారీ హైప్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇండస్ట్రీలో మరో ఆసక్తికర చర్చ ఏమిటంటే… దర్శకధీరుడు రాజమౌళి చూపించిన ట్రెండ్‌ను ప్రశాంత్ నీల్ కూడా ఫాలో అవుతున్నాడా అన్నది. హాలీవుడ్ టాలెంట్‌ను ఇండియన్ సినిమాల్లోకి తీసుకురావడం, కథను రెండు భాగాలుగా తెరకెక్కించడం వంటి అంశాల్లో రాజమౌళి ఫార్ములానే డ్రాగన్‌లోనూ కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ 25న థియేటర్లలో విడుదల కానున్న డ్రాగన్, ఎన్టీఆర్ కెరీర్లోనే అతిపెద్ద రిలీజ్‌లలో ఒకటిగా నిలవనుందని అంచనా.
.png&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!