

అమరన్ సినిమా విజయానంతరం నటుడు శివకార్తికేయన్ మార్కెట్ విలువ ఒక్కసారిగా పెరిగింది. దీంతో తన కొత్త సినిమాల కోసం స్థిరమైన పారితోషికం అడగకుండా లాభాల్లో వాటా మోడల్‌ను ఎంచుకుంటున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. గతంలో కొన్ని సినిమాలకు ఇదే విధానాన్ని అనుసరించిన ఆయన, ఇకపై కూడా అదే పద్ధతిని కొనసాగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం శివకార్తికేయన్ సెయాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అమరన్ తర్వాత ఈ బ్యానర్లో శివకార్తికేయన్ చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రంతో శివకుమార్ మురుగేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “సెయాన్” అనేది కుమారస్వామికి మరో పేరు. ఈ సినిమాకు సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు.
ఈ చిత్రానికి శివకార్తికేయన్ భారీ పారితోషికం అడగలేదని సమాచారం. ముందుగా సుమారు రూ.10 కోట్ల అడ్వాన్స్ తీసుకుని, సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో 70 శాతం వాటా కోరినట్లు తెలుస్తోంది. మిగిలిన 30 శాతం మాత్రం నిర్మాణ సంస్థకు వెళ్తుంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.35 కోట్లుగా చెబుతున్నారు. ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంత జరుగుతుంది, బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్ వస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.


.avif&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!