

టాలీవుడ్లో వరుసగా పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ మరియు రాజకీయ ప్రముఖుల కోసం వేర్వేరు రిసెప్షన్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో అల్లు శిరీష్ – నయనిక వివాహం నిన్న (మార్చి 6) కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ప్రేమ వివాహానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడైన శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తర్వాత అనేక సినిమాల్లో నటించినా ‘రాక్షసుడు’ సినిమా మాత్రమే పెద్ద విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆయన హైందవ, టైసన్ నాయుడు వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో గత కొన్నేళ్లుగా కావ్య రెడ్డి అనే యువతితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆదివారం (మార్చి 8) కుటుంబ సభ్యుల సమక్షంలో వారి నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం.
కావ్య రెడ్డి హైదరాబాద్‌కు చెందినవారు. ఆమె కుటుంబానికి సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేదు. ఆమె తాత జడ్జిగా పనిచేయగా, తండ్రి న్యాయవాదిగా ఉన్నారు. శ్రీనివాస్, కావ్య ఎప్పుడు పరిచయమయ్యారో స్పష్టంగా తెలియకపోయినా ఇద్దరూ ప్రేమలో పడి ఇప్పుడు పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ వేసవిలో లేదా ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరిగే అవకాశముంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!