

ఒక తెలుగు స్టార్ హీరో తండ్రి కాబోతున్నట్టు..ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆ స్టార్ హీరో పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో కావడం మరో విశేషం. దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది. ఇంతకీ.. ఆ హీరో ఎవరు.. అనే పూర్తి వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ హీరోలు ప్రస్తుతం గుడ్ న్యూస్ తెలియజేస్తున్నారు. కొంతమంది బ్యాచిలర్ లైఫ్ ను వీడి.. పెళ్లి అంటూ..గుడ్ న్యూస్ చెబుతూ ఉంటే మరి కొంతమంది తండ్రిగా ప్రమోషన్ పొందుతున్నారు. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కూడా రెండవసారి తండ్రి కాబోతున్నారనే విషయాన్ని ప్రకటించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇలాంటి సమయంలోనే టాలీవుడ్ హీరో రానా కూడా తండ్రిగా ప్రమోషన్ పొందుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
గతంలో కూడా రానా భార్య మిహికా తల్లి కాబోతున్నట్లు ఒక వార్త వచ్చినా వాటిని కొట్టి పారేశారు. అయినప్పటికీ ఇప్పుడు మరొకసారి మిహిక రానా తల్లిదండ్రులు కాబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి అఫీషియల్ గా ఏదైనా మంచి రోజు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ విషయం విన్న అభిమానులు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఈ జంటకి. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న ఈ వార్తలకి అటు రానా కుటుంబం కాని, మిహిక కాని క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!