

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ నటులుగా గుర్తింపు పొందిన వారిలో రజినీకాంత్ మరియు కమల్ హాసన్ ముందు వరుసలో ఉంటారు. దాదాపు 50 సంవత్సరాలుగా వీరు తమ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళ్ మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకుల్లో కూడా వీరికి భారీ అభిమానులు ఉన్నారు. చాలా కాలంగా వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయనున్నారనే వార్తలు వినిపించాయి. ఈ ప్రాజెక్ట్ కోసం మంచి కథ సిద్ధమైందని కూడా చెబుతున్నారు.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో కూడా విడుదలైంది. అందులో “హీరో ఎవరు? విలన్ ఎవరు?” అంటూ రజినీకాంత్, కమల్ హాసన్ మాట్లాడిన సరదా సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఈ సంవత్సరం షూటింగ్ ప్రారంభమై, వచ్చే సంవత్సరం విడుదల అవుతుందని కూడా వార్తలు వచ్చాయి.
అయితే ప్రస్తుతం రజినీకాంత్ మరియు కమల్ హాసన్ మధ్య చిన్న ఈగో క్లాష్ వచ్చిందనే రూమర్లు వినిపిస్తున్నాయి. అందువల్ల ఈ సినిమా నిజంగా మొదలవుతుందా లేదా నిలిచిపోతుందా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. మరోవైపు దర్శకుడు నెల్సన్ ప్రస్తుతం రజినీకాంత్‌తో జైలర్ 2 సినిమా పనుల్లో ఉన్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక ఈ మల్టీస్టారర్‌ను ప్రారంభించాలని భావించినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ నిజంగా జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!